ఫ్రీ కరెంట్పై సీఎం రేవంత్కు హరీశ్ లేఖ

ఫ్రీ కరెంట్పై సీఎం రేవంత్కు హరీశ్ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. రాష్ట్రంలో 200 యూనిట్ ల ఉచిత కరెంట్ పథకం అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  యూనిట్స్ 200 దాటితే బిల్లు మొత్తం వసూలు చేయడంతో ఎంతో మంది పేదలు నష్టపోతారని లేఖలో పేర్కొన్నారు హరీష్ రావు.  ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా రేషన్ కార్డు ఉన్న అందరికీ పథకం వర్తింప చేయాలని కోరారు.  ఎన్ని కుటుంబాలు ఉంటే అన్ని కుటుంబాలకు పథకం వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. 
ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలని లేఖలో డిమాండ్  చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్లరేషన్ కార్డులుంటే, ప్రభుత్వం కేవలం 30 లక్షల మందికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. మిగతా 60 లక్షల మందికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో కూడా 30 లక్షల మంది పేదలుంటే, కేవలం 10 లక్షల మందికే పథకం అమలు చేయాలని నిర్ణయించారు. మిగతా వారికి నష్టం కలుగుతుంది. మొత్తంగా కేవలం మూడో వంతు పేదలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తున్నది. రెండు వంతుల పేదలను విస్మరిస్తున్నారు. ఇది సరైంది కాదు అని హరీశ్ తెలిపారు. 

ఇక ఒక రేషన్ కార్డు కింద ఒక కుటుంబాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక రేషన్ కార్డులో పేర్లున్న వారు రెండు మూడు కుటుంబాలుగా కూడా విడిపోయి బతుకుతున్నారు. వారు ఒకే ఇంట్లో వేర్వేరు పోర్షన్లలో, వేర్వేరు అంతస్తుల్లో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం వారందరినీ ఒకే కుటుంబంగా లెక్క కట్టి ఒక్కరికే పథకం వర్తింప చేస్తున్నది. ఇది కూడా సరైన పద్ధతి కాదన్నారు.