హైడ్రా మీద కేసు నమోదు చేయాలి: హరీశ్ రావు

హైడ్రా మీద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పక్కదారి పట్టించేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.  శని, ఆది వారం వచ్చిందంటే హైదరాబాద్ వాసులు భయపడుతున్నారన్నారు.  గత కాంగ్రెస్ హయాంలోనే  వాళ్లకు అనుమతులు ఇచ్చారని చెప్పారు.  అవి అక్రమ కట్టడాలు అయితే నల్ల బిల్లు, కరెంట్ బిల్లు,ఇంటి టాక్స్ ఎందుకు  వసూల్ చేశారని ఫైర్ అయ్యారు హరీశ్ రావు. హైడ్రా బాధితులకు నష్ట పరిహారం ఇచ్చి తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read :- దసరాకు 6 వేల ప్రత్యేక రైళ్లు

బుచ్చమ్మది ఆత్మహత్యకాదని..ప్రభుత్వ హత్య అని అన్నారు హరీశ్ రావు.   ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని..బీఆర్ఎస్  అండగా ఉంటుందన్నారు.  రేవంత్ సర్కార్ వచ్చాక  ప్రభుత్వ హాస్పిటల్లో  కనీసం జ్వరం వస్తే కూడా మందులు  దొరకని స్థితి ఉందన్నారు హరీశ్ రావు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందన్నారు.