- మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సీఎం తన వ్యక్తిగత భద్రతా విధుల నుంచి స్పెషల్ పోలీసులను తప్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండ్, డిస్మిస్ చేసిన స్పెషల్ పోలీసులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్య 17 వేల మంది స్పెషల్ పోలీసులను అవమానించడమేనన్నారు. తెలంగాణ పోలీసుల విషయంలో సీఎం వివే కంతో నిర్ణయం తీసుకోవాలని సూచించా రు. ఈమేరకు మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
స్పెషల్ పోలీసులు రాష్ట్రానికి మిలిటరీ లాంటివారని, వారి ఆత్మస్థైర్యాన్ని సీఎం దెబ్బతీయకూడదన్నారు. స్పెషల్ పోలీసుల సమస్యల పరిష్కారానికి సీఎం తక్షణమే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి, నిర్ణీత కాలవ్యవధిలో నిర్ణయం తీసుకో వాలని సూచించారు. ఏక్ పోలీస్ విధానా న్ని తీసుకొస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. ఆ హామీని నెరవేర్చాలని స్పెషల్ పోలీసులు చేస్తున్న ఆందోళనపై కనీసం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.