తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడుదాం : హరీశ్ రావు  

తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాడుదాం : హరీశ్ రావు  

బెజ్జంకి, వెలుగు: ఓడిపోయామని బాధపడొద్దని, ప్రజా సమస్యలపై పోరాటం చేద్దామని మాజీమంత్రి హరీశ్​రావు బీఆర్‌‌ఎస్​నాయకులకు భరోసా కల్పించారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో తోటపల్లి సీనియర్ నాయకులు బోయినపల్లి శ్రీనివాసరావు, ఇతర గ్రామస్తులు హైదరాబాదులో  హరీశ్​రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రానున్న స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు.

కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పలు సమస్యలు, రాజకీయ పరిస్థితులు, అభివృద్ధి పనుల అంశాల  గురించి గ్రామస్తులతో చర్చించి అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో రేవోజి రాజు, నాంపల్లి శంకర్, కంపల్లి శ్రీనివాస్, మాసం బాబు, బండి నరేశ్ పాల్గొన్నారు.