రుణమాఫీ సవాల్‎కు ఇంకా కట్టుబడి ఉన్నా.. చిట్ చాట్‎లో హరీష్ రావు

రుణమాఫీ సవాల్‎కు ఇంకా కట్టుబడి ఉన్నా.. చిట్ చాట్‎లో హరీష్ రావు

హైదరాబాద్: రైతు రుణమాఫీ సవాల్ పై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‎లో  గురువారం మీడియా ప్రతినిధులతో హరీష్ రావు చిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీతో పాటు ఆరు గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేస్తే రాజీనామా చేస్తానన్న నా ఛాలెంజ్‎కు ఇంకా కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. రుణమాఫీ‎పై రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని సూచించారు. రుణమాఫీ జరగలేదు అని బ్యాంక్ సిబ్బందిపై కాగితాలు విసిరింది మీరు కాదా..? రుణమాఫీ కాలేదు అని సహాచర మంత్రులే మాట్లాడ్తున్నారని అన్నారు.

ALSO READ | రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురూ..టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు

రుణమాఫీ జరిగిందని కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రుణమాఫీ పూర్తిగా అయ్యిందో లేదో తెలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డి పల్లికి రావాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని, రాహుల్ గాంధీని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రుణమాఫీ విషయంలో రైతులనే కాదు రాహుల్ గాంధీని మూడు సార్లు రేవంత్ రెడ్డి మోసం  చేశాడని.. అందుకే వరంగల్ సభకు రావాలని రాహుల్ గాంధీని కోరలేదని అన్నారు. 

ALSO READ | ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో రిపోర్టర్స్‎తో చిట్ చాట్‎లో ఓల్డ్ సిటీ బిల్లుల వసూలు బాధ్యత అదానీకి అప్పగిస్తామని అన్నారు. హైదరాబాద్‎లో మాత్రం నేను అలా అనలేదని అని గ్లోబల్స్ ప్రచారం చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డివి చిట్ చాట్‎లు కాదని.. అన్ని చీట్ ఛాట్లేననే ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని.. దొంగ తనం చేసిన దొంగే దొంగా దొంగా అరిసినట్టు అతని వైఖరి ఉందని సెటైర్ వేశారు. రుణమాఫీ చేయని గజ దొంగ.. దేవుళ్లను మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదని హరీష్ రావు ఘాట వ్యాఖ్యలు చేశారు.

ALSO READ | హరీష్ రావుది చిట్ చాట్ కాదు.. సోది చాట్.. విప్ శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

కర్నాటకలోని వాల్మీకి స్కామ్ రెడ్ హ్యాండెడ్‎గా దొరికిన స్కామ్ అని.. వాల్మీకి కుంభకోణంపై ఈడీ ఆఫీస్‎కి పోదామా అని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ , బీజేపీ నేతలు ఒక్కరు కూడా వాల్మీకి స్కాం గురించి మాట్లాడడం లేదని.. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కాబట్టి ఈ స్కామ్‎పై హైదరాబాద్‎లో రైడ్స్ జరగడం లేదని ఆరోపణలు చేశారు. అదే బెంగళూరులో ఈడీ తనిఖీలు అవుతున్నాయి.. తెలంగాణ లోను రైడ్స్ చేసే దమ్ము ఉందా..? అని ప్రశ్నించారు. సివిల్స్ సప్లైయ్స్ కూడా రెడ్ హ్యాండ్ గా దొరికిన స్కామ్ అని.. దీనిపైన కూడా కాంగ్రెస్, బీజేపీ నేతలు మాట్లాడరని అన్నారు.