నర్సాపూర్: నాలుగు రోజులు ఆగితే పాలేందో.. నీళ్లేందో అర్థం అయితదని కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు సెటైర్వేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేసింది. వాళ్ల స్కాంలు అందరికీ తెలుసు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలిక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కుంగి పోవద్దు. మానసికంగా దైర్యంగా ఉండాలి. లోకల్‌బాడీ ఎన్నికల్లో కలిసికట్టుగా విజయం సాధిద్దాం. పిలిస్తే నేను గంటలో వస్త’ అని హరీశ్‌రావు అన్నారు.
పార్లమెంట్ లో దాడి దురదృష్టకరం (బాక్స్)పార్లమెంట్ లో దాడి జరగడం దురదృష్టకరమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. లోక్‌సభలో ఎంపీలకే భద్రత కరువైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దుండగులను కఠినంగా శిక్షించాలి. గొప్పలు చెప్పడం కాదు.. భద్రత లోపాలను సరి చేసుకోవాలి’ అని బీజేపీ ప్రభుత్వానికి సూచించారు.