రేవంత్ సర్కార్ రైతులను నట్టేట ముంచిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మళ్లీ సిగ్గులేకుండా సంబరాలు చేసుకోవాలంటున్నారని విమర్శించారు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టారని.. యాసింగికి కోతలు పెట్టారని విమర్శించారు. ఎకరానికి 15 వేలు ఇస్తామని 12 వేలు అంటున్నారు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ఊళ్లలోకి వచ్చే కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలని సూచించారు.
కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు..కైలు రైతుల గురించి ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు హరీశ్ రావు. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోనందుకే సంబరాలు పాలాభిషేకాలు చేయాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ఎక్కడైనాచర్చకు సిద్ధమన్నారు. ఎకరం భూమి ఉన్న రైతులను కూడా రైతు కూలీలుగా గుర్తించాలి.. అలాంటి వారికి రైతు కూలీలకు ఇచ్చే పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు.