అల్లు అర్జున్ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఓన్యాయం.. అల్లు అర్జున్ కి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ తమ్ముడి పేరు రాసి కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే తిరుపతి రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎంతోమంది సీనియర్లను తొక్కుకుంటూ వచ్చి సీఎం అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన నాయకులను తొక్కి సీఎం అయ్యారని అన్నారు. ఏ పార్టీలో ఉన్నా తొక్కుడు.. పదవులు పైన ఎక్కడమే రేవంత్ నైజమన్నారు. ఎల్లకాలం ఇలాంటి సంస్కృతి నడవదన్నారు హరీశ్ రావు.
రేవంత్ రెడ్డి క్రూరమృగాల మద్య నుంచి వచ్చిన వ్యక్తిలా కిరాతకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు హరీశ్ రావు. రేవంత్ పేదలను, రైతులను రోడ్డున పడేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 41 శాతం క్రైం రెట్ పెరిగిందన్నారు. ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని చెప్పారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే రేవంత్ కు తెలిసిన పాలన అని చెప్పురు.
Also Read :- బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కు ఇచ్చిన పుష్ప2 నిర్మాత
వరంగల్ సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను హరీశ్ రావు పరిశిలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్ రావు. కేసీఆర్ తలపెట్టిన 24 అంతస్తుల ఆస్పత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్షం చేసిందన్నారు. ఏడాది అవుతున్నా 16 శాతం పనులు కూడా పూర్తికాలేదన్నారు . కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తానంటున్న రేవంత్ రెడ్డి ఆస్పత్రి నిర్మాణాన్ని ఆపిండని.. ఎంజీఎం ఆస్పత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. యుద్దప్రాతిపదికన ఆస్పత్రి నిర్మాణం పూర్తిచేయాలి.. లేక పోతే పోరాటాలు చేస్తామని చెప్పారు. ఆస్పత్రి నిర్మాణ పనులను ఆపడం దద్దమ్మ పని.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే రేవంత్ రెడ్డి పని. ఆస్పత్రి నిర్మాణం ఆడడం ఎందుకని ఎద్దేవా చేశారు హరీశ్ రావు..