- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్, వెలుగు: గురుకులాల సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థులకు శాపమవుతున్నదని, ప్రభుత్వ పట్టింపులేని తనం పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ గురుకులానికి చెందిన నలు గురు విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయాల పాలైన ఘటనపై ఆయన ట్విటర్లో స్పందించారు.
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసు కోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పాము కాట్లు, కుక్క కాట్లు, ఎలుక కాట్లు, ఫుడ్ పాయిజన్ కేసులు సర్వసాధారణం అయ్యాయని, ఇప్పుడు ఆ జాబితాలో కరెంట్ షాకులు చేరాయని ఎద్దేవా చేశారు.