గొంతు చించుకున్నా మైక్ ఇవ్వలేదు: హరీష్రావు

హైదరాబాద్:రాష్ట్రాభివృద్ధికోసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభలో గొంతు చించుకున్నా మైక్ ఇవ్వలేదని హరీష్రావు ఆరోపించారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా.. జనవరి నెల జీతాలు ఫిబ్రవరి లో ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు.

ALSO READ :- బీఆర్ఎస్ సహకారంతోనే జగన్ తుపాకులతో వచ్చి నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణం అన్నారు. పీవీ కి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందే బీఆర్ ఎస్  అని హరీష్ రావు చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదని అన్నారు హరీష్ రావు.