మూసీ సమస్యలపై పాదయాత్రకు రెడీ : మాజీ మంత్రి హరీశ్ రావు

మూసీ సమస్యలపై పాదయాత్రకు రెడీ : మాజీ మంత్రి హరీశ్ రావు

నర్సాపూర్: మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్​అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికమని మండిపడ్డారు. మెదక్​జిల్లా నర్సాపూర్ బీఆర్ఎస్ ఆఫీస్ లో  ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో హరీశ్​మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి మంత్రులు, ముఖ్యమంత్రి గాలిమోటర్లలో తిరుగుతున్నరు. మూసీ దురావస్థకు కారణం కాంగ్రెస్, టీడీపీ పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిండ్రు. మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోటికంపు ఎక్కువ.  కేటీఆర్ పై కక్ష సాధింపుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే వాటినిఎదుర్కొంటాం’ అని తెలిపారు.