ప్రజాప్రతినిధుల అరెస్టులు దుర్మార్గం
మాజీ మంత్రి హరీశ్‌రావు ట్వీట్
హైదరాబాద్: ప్రజాప్రతినిధుల అక్రమ అరెస్టులు దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయడంపై ఫైర్అయ్యారు.
ALSO READ | ఢిల్లీకి ఎందుకు? హాట్ టాపిక్గా బీజేపీ ఎమ్మెల్యేల హస్తిన టూర్
పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకంత భయం? పురుగులన్నం మాకొద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా? విద్యార్థులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? అప్రజ్యాస్వామిక విధానాలు విడనాడాలని, అరెస్టు చేసిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి, తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్చేస్తున్నం.
వంత్.. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు.. ఫుడ్ పాయిజన్ వల్ల ఆస్పత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి. ఇలాంటి ఘటనలు రిపీట్‌కాకుండా చూసుకోవాలి’ అని సూచించారు.