
తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సిద్దిపేటలోని 107వ పోలింగ్ బూత్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యావంతులు, పట్టణ వాసులు ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలన్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోతంగల్ పోలింగ్ బూత్‌లో ఎంపీ కవిత దంపతులు ఓటేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటు వేశారు. సూర్యపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి, నిర్మల్ జిల్లాలోని ఎల్లంపల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ ఓటును వినియోగించుకున్నారు.
కిషన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన కాచిగూడ దీక్ష మోడల్ స్కూల్లో ఓటు వేశారు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు ఓటేశారు. నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య, నారాయణపేట్ జిల్లా శేరి వేంకటాపుర్‌లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి