ఇంకెంత మంది నోళ్లు మూయిస్తరు : మాజీ మంత్రి హరీశ్​రావు

హైదరాబాద్: నిజనిర్ధారణ కోసం లగచర్లకు వెళ్లిన సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్​అయ్యారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, ఇతర మహిళా సభ్యుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘రేవంత్ రెడ్డి..! ఇదేనా మీరు చెప్పిన ఏడో హామీ అయిన ప్రజాస్వామ్య పాలన. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అన్నరు. కానీ, అవి లేకుండా మీ పాలనలో రోజు గడవడం లేదు. లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంత మందిని అడ్డుకుంటరు? అక్రమ కేసులు పెడుతూ ఇంకెంత మంది నోళ్లు మూయిస్తరు? అధికారం ఉందని రేవంత్ రెడ్డి సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవహక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురిచేస్తున్నడు. నిర్బంధ, నిరంకుశ, రాక్షస పాలన కొనసాగిస్తున్నడు ’అని మండిపడ్డారు.

తప్పును సరిచేసుకోండి

2024 సెప్టెంబర్ 9 కాళోజీ జయంతి సందర్భంగా, ప్రఖ్యాత సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత నలిమెల భాస్కర్‌కు కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం ప్రకటించి ఇప్పటివరకూ ప్రదానం చేయకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాళోజీ జయంతి నాడు సాహితీవేత్తలకు పురస్కారమిచ్చి, గౌరవించుకునే ఆనవాయితీని దురుద్దేశంతో విస్మరించడం దుర్మార్గమన్నారు. ఇది ఒక్క భాస్కర్ కు మాత్రమే జరిగిన అవమానం కాదని.. తెలంగాణ కవులందరికీ జరిగిన అవమానమని పేర్కొన్నారు. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం ప్రారంభం చేస్తున్న సందర్భంగా అయినా భాస్కర్ కి అవార్డు ప్రదానం చేసి.. తప్పును సరి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి  సూచించారు.

ALSO READ | హరీశ్ అలెర్ట్ : కాళేశ్వరం కేసులో బిగుస్తున్న ఉచ్చు