
- మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
లక్ష్మణచాంద(మామడ), వెలుగు : కాంగ్రెస్ ఆదిలాబాద్ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మామడ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ హనుమ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తతో నిర్వహించిన సమావేశానికి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
బీజేపీ ప్రజలను కులమతాల పేరుతో విభజిస్తే కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో పేరిట ఐక్యం చేస్తోందని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఆత్రం సుగుణను గెలిపించి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్
మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమర వేణి నర్సాగౌడ్, ముడుసు సత్యనారాయణ, పాకాల రాంచంధర్, అనుముల భాస్కర్, నరహరి, రాజే శ్వర్, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు.
బైక్ ర్యాలీలో పాల్గొన్న బొజ్జు పటేల్
జన్నారం: ప్రచారానికి చివరి రోజైన శనివారం జన్నారం మండలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. కాంగ్రెస్తోనే అన్ని వర్గాల న్యాయం జరగుతుందని.. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాటలు నమ్మొద్దని బొజ్జు పటేల్కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు.