లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. లేటెస్ట్ గా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇవాళే ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. దీంతో ఇవాళ బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన చేసిన ఇంద్రకరణ్ రెడ్డి..తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ , కడియం శ్రీహరి, తెల్లం వెంకట్ రావు కాంగ్రెస్ లో చేరారు.