బీఆర్ఎస్కు బిగ్ షాక్.. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా

లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.  బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.  కాసేపట్లో కాంగ్రెస్  తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్  దీపాదాస్ మున్షీ సమక్షంలో  ఆపార్టీలో చేరనున్నారు. 

 గత అసెంబ్లీ ఎన్నికల్లో నిర్మల్ నుంచి పోటీ చేసిన ఆయన.. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.