కేసీఆర్ పదేళ్ల కష్టాన్ని నామారూపాల్లేకుండా చేశారు: జగదీష్ రెడ్డి

కేసీఆర్ పదేళ్ల కష్టాన్ని నామారూపాల్లేకుండా చేశారు: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి ఏమి లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శించారు. బుధవారం (మార్చి 26) చివ్వేంల మండలం మొగ్గాయగూడెంలో ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సోయిలేకుండా ప్రవర్తిస్తోందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ తీసుకున్నడు.. కానీ దానిపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. 

పాలన చేతగాక పోతే మాకు అప్పగించండి.. కాలేశ్వరం నీటిని ఏ విధంగా విడుదల చేయాలో చేసి చూపిస్తామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కేసీఆర్ అద్భుతమైన ప్రణాళికతో తెలంగాణను భారతదేశంలోనే  నెంబర్ వన్‎గా చేశాడని.. కాంగ్రెస్ వచ్చాక  ఆర్థిక రంగం మొత్తం కుదేలై వెనకబడే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ఈ ఏడాది ప్రజల ఖజానాకు రావాలసిన రూ.15 వేల కోట్ల డబ్బులు మీ జేబుల్లోకి పోయిందని స్పష్టంగా అర్థమవుతుందని ఆరోపించారు. 

ALSO READ | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటో.. మాటల్లో కాదు చేతల్లో చూపించాం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ కోసం కేసీఆర్ పడ్డ పదేళ్ల కష్టం నామరూపల్లె లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏండ్లలో అభివృద్ధి చేసి చూపిస్తే సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ తెలంగాణను నాశనం చేస్తోందని దుయ్యబట్టారు. ఇకనైనా ప్రభుత్వం సాగునీరు ఇస్తే కొన్ని పొలాలైనా చేతికొచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఆలోచించి తక్షణమే రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్‎కు విజ్ఞప్తి చేస్తున్నాం.. చివరి పంటకు సాగుకైన నీటిని విడుదల చేయాలన్నారు.