తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి పాత్ర కీలకం : డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు 

సారంగాపూర్, వెలుగు: మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతిని సారంగపూర్ మండల కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జైపాల్ రెడ్డి ఫొటోకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు 
పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, ఎన్నో పోరాటాలు చేశారని పేర్కొన్నారు.

పార్లమెంట్ విలువలు కాపాడి, ఉత్తమ పార్లమెంటేరియన్​గా నిలిచి, తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహానేత అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, ఉపాధ్యక్షుడు ఈటల శ్రీనివాస్, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, మాజీ జడ్పీటీసీలు పి.రాజేశ్వర్ రెడ్డి, రొడ్డ మారుతి, మండల కాంగ్రెస్​అధ్యక్షుడు బి.నర్సయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.మల్లారెడ్డి, పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.