పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : కుందూరు జానారెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : పార్లమెంట్‌‌‌‌ ఎన్నికలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జానారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం మిర్యాలగూడలోని పార్టీ ఆఫీస్‌‌‌‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్‌‌‌‌ గెలపుకోసం కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు.

పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా పదవులు వస్తాయని చెప్పారు.  అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇంటికి వెళ్లారు. ఇటీవల చనిపోయిన ఎమ్మెల్యే తల్లి వెంకట్రావమ్మ ఫొటోకు పూలమాల వేసి నివాళి అర్పించి.. లక్ష్మారెడ్డిని పరామర్శించారు.

జానారెడ్డి వెంట డీసీసీ  అధ్యక్షుడు కేతవత్ శంకర్ నాయక్ , పీసీసీ మెంబర్లు చిరుమర్రి కృష్ణయ్య, పగిడి రామలింగయ్య యాదవ్ ,  నాయకులు  స్కైలాబ్ నాయక్,  గాయం ఉపేందర్ రెడ్డి,  పొదిల శ్రీనివాస్,  సైదులు  గోపగాని మాధవి,  సలీం, ఆరిఫ్, నర్సింగ్ వెంకటేశ్వర్లు ఉన్నారు.

జానారెడ్డిని సన్మానించిన రైస్ మిల్లర్లు 

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు వచ్చిన  మాజీ మంత్రి  కుందూరు జానారెడ్డిని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేశ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గౌరు శ్రీనివాస్, వెంకట రమణ చౌదరి, రాష్ట్ర నాయకులు బండారు కుశలయ్య, రేపాల మధు సూధన్ ఉన్నారు.