తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. మొత్తం 55 మందితో ఈ జాబితాను ప్రకటించింది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ మంత్రి కొండా సురేఖ పేరు లేదు. ఇదే న్యూస్ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్ 2018 సెప్టెంబర్ 6వ తేదీన శాసనసభ రద్దు చేసి అదే రోజు 105 మంది పార్టీ సభ్యులతో తొలి జాబితా విడుదల చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన తొలి జాబితాలో తమ పేర్లు లేవని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ లో చేరారు కొండా సురేఖ.
ఆదివారం (అక్టోబర్ 15న) కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే.. రెండో జాబితాలో అయినా పేరు వస్తుందా..? రాదా..? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కొండా దంపతులు ఏ నిర్ణయం తీసుకుంటారోననే టెన్షన్ నెలకొంది.