![బీఆర్ఎస్ కు మాజీ మంత్రి రిజైన్ ..త్వరలో బీజేపీలోకి.?](https://static.v6velugu.com/uploads/2023/08/Former-minister-Krishna-Yadav-resigned-from-BRS_wHGQTJpSB5.jpg)
బీఆర్ఎస్ అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. టికెట్ రాకపోవడంతో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు. లేటెస్ట్ గా బీఆర్ఎస్ కు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ రాజీనామా చేశారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ జాబితాలో కృష్ణ యాదవ్ పేరు లేకపోవడంతో ఆయన అసంతృప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో కృష్ణ యాదవ్ బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో కృష్ణ యాదవ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అంబర్ పేట, లేదా, మలక్ పేట టికెట్ ను అడుగుతున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ మలక్ పేట టికెట్ తీగల అజిత్ రెడ్డికి, అంబర్ పేట టికెట్ కాలేరు వెంకటేశ్ కు ఇచ్చారు.