MLA కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య: కేటీఆర్

హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‎ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి సర్కార్‎కు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తన అసమర్థ, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ | తెలంగాణ రాష్ట్ర సాధనలో మంద జగన్నాథం పాత్ర మరువలేనిది: ఎమ్మెల్యే వివేక్

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనకేసుకొచ్చి.. ఇదేంటని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అని అన్నారు. ప్రభుత్వ వైఫ్యలాలపై మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి అణిచివేత చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో వాగ్వాదం కేసులో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు సోమవారం (జనవరి 13) సాయంత్రం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లో అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్ ‎కు తరలించారు.