మాజీ మంత్రి కేటీఆర్, సినీ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత సోమవారం సినీ నటుడు రాజేంద్రప్రసాద్ని పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల చనిపోగా, ఆమె పెద్ద కర్మ సోమవారం నిర్వహించారు.
కేపీహెచ్బీ కాలనీలోని రాజేంద్రప్రసాద్ఇంటికి వచ్చిన వారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేటీఆర్ వెంట కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఉన్నారు. – కూకట్పల్లి, వెలుగు