తెలంగాణ తల్లిని అవమానిస్తరా..? కేటీఆర్​ట్వీట్​

తెలంగాణ తల్లిని అవమానిస్తరా..? కేటీఆర్​ట్వీట్​

హైదరాబాద్: సెక్రటేరియట్ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్​సర్కార్‌ తెలంగాణ తల్లిని అవమానిస్తోందని ఫైర్​అయ్యారు. ‘తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా? నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన.. ‘తెలంగాణ తల్లి’ విగ్రహం పెట్టాల్సిన చోట. ‘రాహుల్ గాంధీ తండ్రి’ విగ్రహం పెడతారా..?? తెలంగాణ సమాజం కాంగ్రెస్ ను క్షమించదు..!’ అంటూ ట్విట్టర్​వేదికగా ఫైర్‌ అయ్యారు.

 ​ తెలంగాణలో కాంగ్రెస్ అవినీతిపై చర్యలేవి అంటూ ప్రధాని మోదీని మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‎లో ప్రశ్నించారు. ‘మీరు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి మాట్లాడి 4 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడానికి ఏదైనా నిర్దిష్టం కారణం ఉందా? రాష్ట్రంలో కాంగ్రెస్ భారీ అవినీతి చేస్తుందని మీరు అంటారు. మీ సహచరులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాత్రం నోరెత్తరు. వారు మీతో ఏకీభవించలేదా? లేక మీ విమర్శ ఎన్నికల జుమ్లానా?’ అని ప్రశ్నించారు.