అధికారిక నిర్ణయమా? అనధికార నిర్లక్ష్యమా?: కేటీఆర్

అధికారిక నిర్ణయమా? అనధికార నిర్లక్ష్యమా?: కేటీఆర్
  • వరంగల్‌లో ఫ్లెక్సీ పై కేటీఆర్​ట్వీట్

హైదరాబాద్‌:గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ హెడ్​ఆఫీసు ఎదుట వెలసిన ఫ్లెక్సీపై మాజీ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్​వేదికగా ఫైర్​అయ్యారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ లేని రాజముద్రతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 

ఇది అధికారిక నిర్ణయమా? అనధికార నిర్లక్ష్యమా? అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా? తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం, చార్మినార్‌లతో ఈ వెకిలి పనులేంటి? ఈ కొత్త చిహ్నాన్ని ఎవరు? ఎప్పుడు ఆమోదించారు?ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారు? దీనికి కారకులెవరో కనుక్కొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న’ అంటూ ఆ పోస్టును సీఎస్‌ శాంతికుమారికి ట్యాగ్‌ చేశారు.