- మాజీ మంత్రి కేటీఆర్
హనుమకొండ/ కమలాపూర్, వెలుగు : 'దేశంలో అన్ని పిరం కావడానికి మోదీ కారణం. పదేండ్లలో రూ.30 లక్షల కోట్లు సామాన్యుల ముక్కుపిండి వసూలు చేసిండు, నేను చెప్పేది తప్పని రుజువు చేస్తే రేపు సాయంత్రం వరకు నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు
మద్దతుగా శుక్రవారం రాత్రి ఆయన రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలో పేదోళ్లను కొట్టి పెద్దవాళ్లకు పంచిపెట్టాడని విమర్శించారు. ఎంపీగా గెలిచి ఉప్పల్ బ్రిడ్జి కూడా పూర్తి చేయని, బండి సంజయ్ కి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అబద్ధాలని విమర్శించారు.
రాష్ట్రంలో 10, 12 ఎంపీలు బీఆర్ఎస్కు అప్పజెప్తే కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు గెల్లు శ్రీనివాస్ తదితరులున్నారు.