తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్

తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేధమా? : కేటీఆర్

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేదించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు.  తెలంగాణ గొంతుక అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? అని ప్రశ్నించారు.  మోదీ విద్వేషాలు ఈసీకి వినిపించలేదా? రేవంత్  బూతులు ఈసీకి ప్రకవచనాల్లాగా అనిపించాయా అనిప్రశ్నించారు. ఇది బడేభాయ్,చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా అని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర చూసి బీజేపీ,కాంగ్రెస్ బయపడుతున్నాయని విమర్శించారు.  వాళ్ల  అహంకారానికి  తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. మే 1 (ఈరోజు) రాత్రి నుంచి 48 గంటల పాటు బీఆర్ఎస్ అధినేత ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. సిరిసిల్ల సభలో ఏప్రిల్ 25న  కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఈ చర్య తీసుకుంది. కేసీఆర్ బస్సు యాత్రలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ 48 గంటలపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేదం విధించింది. ఏప్రిల్  బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేదం అమలులో ఉంటుంది.