రాజకీయ సన్యాసం తీసుకుంటా..పొంగులేటికి కేటీఆర్ సవాల్

రాజకీయ సన్యాసం తీసుకుంటా..పొంగులేటికి కేటీఆర్ సవాల్

హైదరాబాద్: అమృత్ండర్లలో స్కాం జరగలేదంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గాణ దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిం చాలని సవాల్చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మంత్రి పొంగులేటి సవాల్ను స్వీకరిస్తున్నాను. చి త్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం. అక్రమాలు జరగలే దని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా. లేదంటే సెంట్రల్ కమిషనర్ దగ్గరకు పోదాం. రేవంత్ సీఎం పదవి ఊడగొట్టాలన్న | ఆలోచన ఉన్నట్టుంది.

 రాజీనామా చేస్తానని పొంగులేటి ప్రగల్భాలు చేస్తున్నాడు. అమృత్ టెండర్లు రద్దు చేయాలి. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దసరా బోనస్ కాదు.. బోగస్. సింగరేణి ప్రైవేటీకరణ ప్రక్రి యను అడ్డుకునేందుకు అందరూ ముందుకు రావాలి. కార్మికులు ఎమ్మెల్యేలను, మంత్రిని కలవండి.. 33% వాటా ఎందుకు ఇవ్వడం లేదో నిలదీయండి' అని అన్నారు.