ఇట్లైతదని ఎవరనుకున్నరు?..మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్​​

ఇట్లైతదని ఎవరనుకున్నరు?..మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్​​
  • ‘మార్పు’అందర్నీ మోసగించింది
  • కాంగ్రెస్ కఠినగుండెలు కరిగేదెన్నడు ?
  • మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్​​

హైదరాబాద్: కాంగ్రెస్​సర్కార్​పై మాజీ మంత్రి కేటీఆర్​ట్విట్టర్​వేదికగా మండిపడ్డారు. రాష్ట్రంలో పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కుతారని, ఠంచన్ గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరునుకున్నారు? అని ప్రశ్నించారు. 

‘మూసీ బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి.. కనికరం లేకుండా వృద్ధుల పెన్షన్ డబ్బులను ఆపారు. మందుబిల్లల కోసం కొడుకులు, కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే  ‘మార్పు’ వచ్చింది. 

ALSO READ | ప్రభుత్వానికి ఎందుకంత భయం? :-మాజీ మంత్రి హరీశ్​రావు ట్వీట్​

అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో.. ఇంటింటా ఇక్కట్లే ఉన్నాయి. మార్పు అందర్నీ మోసగిస్తుందని ఎవరనుకున్నారు? నాడు గల్లా ఎగరేసిన రైతు నేడు నేలచూపులు చూస్తున్నాడు.

 కాంగ్రెస్ ప్రభుత్వం రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టింది. రుణం తీరక, కొత్త రుణం లేక, అప్పుపుట్టక రైతన్న ఆగమైపోతున్నాడు. కాంగ్రెస్ కఠిన గుండెలు కరిగేదెన్నడు?. రాష్ట్రంలో రైతన్నల కష్టాలు తీరేదెన్నడు?’ అంటూ ట్వీట్​చేశారు.