సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తమపై కోపంతోనే బతుకమ్మ చీరలు ఆర్డర్ క్యాన్సిల్చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు, చేనేతలను ఆదుకున్నామని గుర్తుచేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డరు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పిండు.
రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ పై బురద జల్లుతున్నరు. రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ ఉన్న కేకే మహేందర్ రెడ్డి దాకా అందరూ సన్నాసులు, చేతకాని వెధవలే. కరీంనగర్ఎంపీ బండి సంజయ్ఓ సన్యాసి. కేవలం మతం పేరుతో ఓట్లు అడగటం తప్ప ఆయనకేం తెల్వదు. సంజయ్ ఎటువంటి అభివృద్ధి చేశారో.. చర్చకు రావాలి’ అని కేటీఆర్ సవాల్ విసిరారు.