మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడిపై చీటింగ్ కేసు

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడిపై చీటింగ్ కేసు

జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్​రెడ్డిపై చీటింగ్ కేసు నమోదైంది. జీడిమెట్ల శాటిలైట్ టౌన్​షిప్​కు చెందిన కొల్లు ఏసుబాబు ‘విజన్ ​ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్’ ​పేరుతో హౌస్​ కీపింగ్, సెక్యూరిటీ, ఇతర మ్యాన్ పవర్​సర్వీసులను నిర్వహిస్తున్నాడు. ఈ పనుల కోసం 2022లో మర్రి రాజశేఖర్ ​రెడ్డి ఫౌండర్​గా ఉన్న దుండిగల్​లోని అరుంధతి హాస్పిటల్​తో రూ.52 లక్షలకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడు.

మొత్తం 28 మంది సిబ్బందిని అందించగా.. అందుకు రూ.52 లక్షలు చెల్లిస్తామని రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు బాధితుడు తెలిపారు. అయితే ఇప్పటివరకు పలు దఫాల్లో కేవలం రూ.32 లక్షలే చెల్లించారని, మిగిలిన డబ్బుల కోసం పలుమార్లు అడిగినా స్పందించలేదన్నారు. దీంతో అరుంధతి హాస్పిటల్​ ఫౌండర్​గా​రాజశేఖర్​రెడ్డి తనను చీటింగ్ చేశాడని, ఆయనతో తనకు ప్రాణహాని ఉన్నట్లు బాధితుడు హైదరాబాద్​లోని  పేట్​బషీరాబాద్​పోలీసులకు ఈ నెల 10న ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.