
హైదరాబాద్: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లా రెడ్డి చెన్నూరు శాసన సభ్యుడు వివేక్ వెంకట స్వామికి ఎదురు పడ్డారు..' వివేక్ అన్న కంగ్రా ట్స్.. మంత్రి పదవి వస్తుంది అని తెలిసింది.. అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి కూడా కంగ్రాట్స్ అంటూ ఆలింగనం చే సుకున్నాడు. ఈ సందర్భంగా.. దేశంలో 3 యూనివర్సిటీలు నా ఒక్కనికే ఉన్నాయి. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. నా ఏజ్ కూడా అయింది. నా జీవితానికి ఇది చాలు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా మా ఇంట్లో టికెట్ల కోసం చాలా మంది ఉన్నారు' అంటూ నవ్వులు పూయిస్తూ వెళ్లిపోయారు.
ALSO READ | కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు.. నలుగురు లేదా ఐదుగురికి చాన్స్!