మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని చెప్పారు మల్లారెడ్డి. మే 20న సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు.
మరోవైపు సుచిత్రలోని వివాదాస్పద భూమిని సర్వే చేస్తున్నారు కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి... మరో వర్గానికి భూ వివాదం నడుస్తోంది. కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్ లోని వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే తమ దగ్గరున్న డాక్యుమెంట్స్ ను అధికారులకు ఇచ్చారు మల్లారెడ్డి, మరో వర్గానికి చెందినవారు.
సర్వే చేస్తున్న భూమి దగ్గరకు వచ్చారు మాజీమంత్రి మల్లారెడ్డి, వ్యతిరేక వర్గానికి చెందిన 15 మంది వ్యక్తులు. లాండ్ సర్వే జరుగుతున్న ప్రదేశంలో భారీగా మోహరించారు లా అండ్ ఆర్డర్, SOT పోలీసులు.