- ఏడాదికి 4 సినిమాలు తీస్తుంటి
- నేనే ఓ శాటిలైట్ చానల్ పెడ్తుంటి
- మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తే తాను హోం మంత్రి అయ్యే వాడినని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మీడియాలో చిట్ చాట్ చేశారాయన. తానే ఏడాదికి నాలుగు సినిమాలు తీసేవాడినని చెప్పారు. అలాగే తానే ఓ శాటిలైట్ చానల్ పెట్టేవాడినని ఆన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారులో హోం మంత్రి పదవి సీఎం దగ్గర ఉందన్నారు.