నేను రాజీనామాకు సిద్ధం..మీరూ సిద్ధమా?: హరీష్ రావు

నేను రాజీనామాకు సిద్ధం..మీరూ సిద్ధమా?: హరీష్ రావు
  • సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు సవాల్

హైదరాబాద్, వెలుగు: పంద్రాగస్టులోపు రైతులందరికీ రుణమాఫీ చేయడంతో పాటు, ఆరు గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తే.. తాను రాజీనామాకు సిద్ధమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు ప్రకటించారు. ఒకవేళ అవన్నీ అమలు చేయకపోతే మీరు కూడా రాజీనామాకు సిద్ధమా అని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ గురువారం సాయంత్రం హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు ట్వీట్ చేశారు. 

‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయింది తమరు. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోయింది తమరు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది. 

నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుంది అంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను. మరోసారి చెబుతున్నా.. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం. చేయని పక్షంలో నువ్వు సిద్ధమా?”అని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉద్దేశించి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు.