కాంగ్రెస్ అసంతృప్తులు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ ను వీడుతున్నారు. మాజీ మంత్రి సీనియర్ నేత నాగం జనార్థన్ రెడ్డి నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారు. నాగర్ కర్నూల్ టికెట్ ను కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్. అప్పటి నుంచి కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన మరో రెండు రోజుల్లో బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 29న సాయంత్రం మంత్రి కేటీఆర్ నాగం జనార్థన్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. మర్యాదపూర్వకంగా పార్టీలోకి రావాలంటూ నాగంను ఆహ్వానించనున్నారు. మరో రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో నాగం జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
ALSO READ : జాన్సన్ నాయక్ కేటీఆర్ దోస్తు.. నా తమ్ముడు: హరీశ్ రావు
ఇప్పటికే ఎల్లారెడ్డి టికెట్ ఆశించిన సుభాష్ రెడ్డి.. కూకట్ పల్లి నియోజకవర్గం టికెట్ ఆశించిన గొట్టిముక్కల వెంగళ్ రావు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు.