డిండికి నీటి తరలింపుపై సీఎంకు నాగం లేఖ

డిండికి నీటి తరలింపుపై సీఎంకు నాగం లేఖ

నాగర్ కర్నూల్, వెలుగు: డిండి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​కు పీఆర్ఎల్ఐ​పరిధిలోని ఏదుల రిజర్వాయర్​ నుంచి రోజుకు 0.5 టీఎంసీలు తరలించాలన్న నిర్ణయాన్ని పున: పరిశీలించాలని మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్​రెడ్డికి లేఖ రాశారు. 

పాలమూరు ప్రాజెక్ట్​ నుంచి డిండి లిఫ్ట్​కు నీటిని తరలిస్తే పాలమూరు కింద 12 లక్షల ఎకరాలకు సాగు నీరివ్వడం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని దేవరకొండ, మునుగోడుతో పాటు ఇతర ప్రాంతాలకు 3.41 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఎమ్మార్ఎస్ఎల్బీసీ​టన్నెల్​ నుంచి నీటిని డిండి రిజర్వాయర్​కు తరలించేందుకు రూ.5,735 కోట్లతో డీపీఆర్​ తయారు చేసి టన్నెల్​ పనులు కంప్లీట్​ అవుతుండగా, ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. సాగు నీళ్లు లేక పడావు​ పడిన పాలమూరు జిల్లా నుంచి నల్గొండకు నీటిని తరలించాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్ట్​ను ఖరాబ్​ చేయవద్దని సీఎంకు విజ్ఞప్తి చేశారు.