రేవంత్ లాంటోళ్లు100 మంది వచ్చినాబీఆర్ఎస్ ను ఏమీ చేయలేరు : నిరంజన్ రెడ్డి

రేవంత్ లాంటోళ్లు100 మంది వచ్చినాబీఆర్ఎస్ ను ఏమీ చేయలేరు :  నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బలం లేకున్నా ప్రలోభాలకు తెరలేసి అభ్యర్థిని నిలిపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని వందమంది రేవంత్ రెడ్డిలు వచ్చిన ఏమీ చేయలేరన్నారు. ఇప్పటికైనా అభివృద్ధిపై సీఎం రేవంత్​ దృష్టి పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. 

రాజకీయ హత్యలపై నిష్పక్షపాత విచారణ జరపాలని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్​ చేశారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలు మంత్రి జూపల్లి కృష్ణారావు వల్ల కల్లోలిత ప్రాంతాలుగా మారుతున్నాయన్నారు. లక్ష్మీపల్లిలో బొడ్డు.శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11రోజులు అవుతున్న నేటికీ హంతకులను పట్టుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో  పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు రమేశ్ గౌడ్  పాల్గొన్నారు.