
హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిని మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబం భావిస్తోంది. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ నుంచి కొడాలి నానిని ఇవాళ డిశ్చార్జ్ చేయాలని వైద్యులు డిసైడ్ అయినట్లు తెలిసింది. ఏఐజీ హాస్పిటల్ వైద్యులు చేసిన వైద్య పరీక్షల్లో కొడాలి నాని గుండెకు సంబంధించిన 3 కవాటాలు మూసుకుపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. స్టెంట్ లేదా బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు కొడాలి నాని కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు.
Also Read:-హైదరాబాద్ ఆకాశ వీధుల్లో విమానం నడిపిన వైసీపీ నేత కేతిరెడ్డి..!
అయితే..హార్ట్ స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం కొడాలి నానిని ముంబైలోని ప్రముఖ హాస్పిటల్ అయిన ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్కు తరలించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడే కాదని.. సర్జరీ విషయంలో కొంత సమయం తీసుకోవాలని కొడాలి నాని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.