తమ పిల్లలకు ఉన్నత స్థాయి పోస్టులు వచ్చేలా ప్రశ్నాపత్రాలను లీక్​

తమ పిల్లలకు ఉన్నత స్థాయి పోస్టులు వచ్చేలా ప్రశ్నాపత్రాలను లీక్​

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్​ లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి పి చంద్రశేఖర్  ఆరోపించారు. ఆదివారం బీజేపీ జిల్లా ఆఫీసులో నిరుద్యోగ మార్చ్  సక్సెస్​పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు తమ పిల్లలకు ఉన్నత స్థాయి పోస్టులు వచ్చేలా ప్రశ్నాపత్రాలను లీక్​ చేశారని విమర్శించారు. ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి వచ్చి పరీక్షలు రాసి వెళ్లారని, వారికి లుక్ అవుట్  నోటీసు జారీ చేశామని పోలీసులు చెబుతున్నారన్నారు. ఏ మేరకు ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందనే విషయం అర్థం చేసుకోవచ్చని తెలిపారు. కష్టపడి చదివి పరీక్షలు రాసిన వారికి ఉద్యోగాలు వస్తాయనే ఆశ లేకుండా పోయిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందన్నారు. నిరుద్యోగ మార్చ్​ను సక్సెస్​ చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, ఎన్పీ వెంకటేశ్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ వర్ధన్ రెడ్డి, దరువు ఎల్లన్న, పుల్ల రవియాదవ్, అచ్చుగట్ల అంజయ్య, చిన్న వీరయ్య పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ రూరల్: ఈ నెల 25న జరిగే నిరుద్యోగ మార్చ్ కు నిరుద్యోగులు, విద్యార్థులు, మేధావులు తరలివచ్చి సక్సెస్​ చేయాలని బీజేపీ నేత ఎన్పీ వెంకటేశ్​ పిలుపునిచ్చారు. మండలంలోని అంబటిపల్లి గ్రామంలో మన భవిష్యత్, మన భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజుగౌడ్, తిరుపతిరెడ్డి, భూషణ్, కుమ్మరి చంద్రశేఖర్, అంజన్న, రవిరెడ్డి, శ్రీనివాస్ యాదవ్  పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర కోరారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నిరుద్యోగ మార్చ్ లో నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొనాలని కోరారు. సంతోష్, సత్యనారాయణ, వెంకటేశ్, విజయభాస్కర్, చందు, వినోద్  పాల్గొన్నారు. పెబ్బేరు: సీఎం కేసీఆర్​ నిరుద్యోగులకు చేసిందేమీ లేదని బీజేపీ వనపర్తి నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్  విమర్శించారు. మండలంలోని రంగాపురం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ మార్చ్​ను సక్సెస్​ చేయాలని కోరారు. భగవంతు, నాగరాజు, రఘు, దేవేందర్  పాల్గొన్నారు.