కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే పేదలకు పట్టాలుప్పిస్తాం :సుదర్శన్​ రెడ్డి

బోధన్,​ వెలుగు: కాంగ్రెస్ ​అధికారంలోకి రాగానే సాలూరా మండలంలోని హున్సా, మందర్నా, ఖజాపూర్​ గ్రామాల్లో గవర్నమెంట్ ఇచ్చిన భూముల్లో సాగుచేసుకుంటున్న పేదలకు పట్టాలిప్పిస్తానని మాజీ మంత్రి.పి.సుదర్శన్​ రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేండ్ల పాటు అధికారంలో ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రజలకిచ్చిన ఏ హామీని అధికార పార్టీ నెరవేర్చలేదన్నారు.

ALSO READ : బీజేపీ డకౌట్.. కాంగ్రెస్​ రనౌట్..​ బీఆర్ఎస్​ సెంచరీ : హరీశ్ రావు 

నిరుద్యోగ భృతి, డబుల్​బెడ్ ​రూమ్​ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి ఏమయ్యాయన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్​ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప, ఒక్క డబుల్​బెడ్ ​రూమ్​ నిర్మించలేదన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీములు అమలు చేస్తామన్నారు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు తాహెర్​ బీన్ ​హందాన్, మండలాధ్యక్షులు నాగేశ్వరరావు, మందర్నా రవి, హున్సా మాజీ ఎంపీటీసీ శంకర్​పటేల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.