మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్

మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్ సంచలనంగా మారింది. ఖమ్మంలోని సొంత పార్టీ నేతలైన మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ తాత. మధులను దుర్భషలాడుతూ , మండల నాయకుడిని కాళ్లు , చేతులు నరకాలని సలహాలు ఇస్తున్నట్లుగా ఆడియోలో రికార్డు అయింది.   కందాల ఉపేందర్ రెడ్డిని ఆగం చేసి పాలేరు నుంచి తాత మధు పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా  పువ్వాడ మాట్లాడారు.  పువ్వాడ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా దుమారం లేపుతున్నాయి.