సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు మెజార్టీ సీట్లు రాకపోతే జగదీశ్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం పట్టణంలోని గాంధీనగర్ లో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభివృద్ధి ముసుగులో అవినీతి చేసి ప్రగల్బాలు పలుకుతున్నావా.. జగదీశ్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.
గాంధీనగర్ ప్రజలు ఇక్కడ ఉన్న చోట నయీమ్ ను చూసి భయపడుతున్నారని, గాంధీనగర్ కావాలో.. గాడ్సేనగర్ కావాలో ప్రజలు తేల్చుకోవాలన్నారు. సూర్యాపేట ప్రజల కోసం 24 గంటలు తాను, తన కుమారుడు సర్వోత్తంరెడ్డి అందుబాటులో ఉంటామని తెలిపారు. నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.