బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఫైర్

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిపై  మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై పదేపదే విమర్శలు గుప్పిస్తున్న జగదీశ్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా.. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి సిగ్గుందా అని అన్నారు. గత 10 సంవత్సరాలుగా సూర్యాపేట నియోజకవర్గాన్ని అవినీతి మాయం చేశాడన్నారు. అధికారం కోల్పోయాక హైదరాబాద్ వెళ్ళిపోయాడని తెలిపారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరోజైనా ఒక్క గ్రామానికి అయినా వెళ్ళావా అని ప్రశ్నించారు. 

సూర్యాపేట అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాను మూడు పర్యాయాలు ఓటమి చెందిన నిత్యం ప్రజల తోటి ఉంటున్నానని తెలిపారు. కొంతమంది నాయకులను కోటరీగా ఏర్పాటు చేసుకొని భూకబ్జాలు చేసిన చరిత్ర జగదీష్ రెడ్డి ది అన్నారు. జగదీశ్ ఇంకా అధికారంలోనే ఉన్నా అనుకుంటున్నాడని అన్నారు. జగదీశ్, తన అనుచరులు చేసిన అవినీతి,భూ కబ్జాలు వెలికితీస్తా అని తెలిపారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో యువకుల వద్ద జగదీశ్ భారీగా డబ్బులు దండుకున్నారని అన్నారు.