పుంగనూరు బాలికను కొంతమంది కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటనపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సెప్టెంబర్ 29 న కిడ్నాప్ అయిన పాప నాలుగు రోజులపాటు ఆ సమీప ప్రాంతాల్లో నే ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గుర్తించలేకపోవడం ప్రభుత్వ అసమర్దత కాదా అని ప్రశ్నించారు. ఆడపిల్లలను స్కూలుకు పంపించాలంటే తల్లి దండ్రులకు భయమేస్తుందన్న మాజీ మంత్రి రోజా... వారం తరువాత ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్జీవంగా కనిపించందంటే...మహిళా హోం మంత్రి.. సీఎం, డిప్యూటీ సీఎం లు ఏం చేస్తున్నారన్నారు.
అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా..పోలీసులు ఉన్నారా అంటూ .. ప్రజలను కాపాడాల్సిన పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి.. తప్పుడు కేసులను పెట్టేందుకు ఉపయోగిస్తున్నారన్నారు. తప్పుడు కేసుల పెట్టేందుకు మదనపల్లి ఫైల్స్ పేరుతో ప్రత్యేక హెలికాప్టర్‌ను పంపిన ప్రభుత్వం.. ఫైల్స్‌కు ఇచ్చిన విలువ ఆడబిడ్డల రక్షణ ఇవ్వదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీలో మహిళలను.. పసిబిడ్డలను కాపాడేవారు ఎవరూ లేరన్నారు. మీకు జన్మనిచ్చిన తల్లి కూడా మహిళేనని గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి రోజా అన్నారు.
జగన్మోహన్ రెడ్డి 9 వ తేదీ పుంగనూరుకు వస్తున్నాడని తెలిసి ప్రభుత్వం, హోం మంత్రి పరుగులు తీస్తున్నారన్నారు. ఇప్పటికైనా కక్ష సాధింపుతో దిశ చట్టాన్ని, మహిళా పోలీసులను నిర్వీర్యం చేయకుండా బలోపేతం చేయాలన్నారు . సీఎం తనయుడు.. మంత్రి లోకేష్ నియోజకవర్గంలో కేవలం 24 గంటల్లోనే ముగ్గురు మహిళలపై అత్యాచారం జరిగిందంటే.. వీళ్లకు పాలించే అర్హత ఉందా అని ప్రశ్నించారు. పుంగనూరు ఘటన నిందితులను తక్షణం అరెస్టు చేయాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు.