మంచి చేసి ఓడిపోయాం..మేమెందుకు సిగ్గుపడాలి: మాజీ మంత్రి రోజా 

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 11 అసెంబ్లీ స్థానాలు, 4 ఎంపీ స్థానాలు మాత్రమే వైసీపీ గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా వైసీపీకి దక్కలేదు. దాదాపు మంత్రులుగా ఉన్న వైసీపీ నేతలంతా ఓడిపోయారు. ఈ ఎన్నికలలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా ఓడిపోయారు. నగరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆమెపై  తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ 45 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.అయితే మాజీ మంత్రి రోజా తన ఓటమిపై తొలిసారి సోషల్ మీడియాలో స్పందించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం ఓటమి చెందిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా కార్యకర్తలకు భరోసా ఇస్తూ ప్రకటనలు చేస్తున్నారు. ఈక్రమంలో రోజా కూడా తాజాగా సోషల్ మీడియా ద్వారా ఓటమిపై స్పందించారు. “చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.కానీ మంచి చేసి ఓడిపో యాం. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం” అని సోషల్ మీడియాలో  రోజా పోస్ట్  షేర్ చేశారు.