మాజీ మంత్రి సబితకు అస్వస్థత.. కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌‌లో ఫుడ్‌‌ పాయిజన్‌‌

మాజీ మంత్రి సబితకు అస్వస్థత.. కేసీఆర్  ఫామ్‌‌హౌస్‌‌లో ఫుడ్‌‌ పాయిజన్‌‌

ములుగు, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్ఎస్  ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం బీఆర్ఎస్  అధినేత కేసీఆర్​కు చెందిన ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

 రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటి తరువాత సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను రాత్రి ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు డిశ్చార్జ్  చేయడంతో ఆమె ఇంటికి వెళ్లిపోయారు.