బీఆర్‌‌ఎస్‌ రజతోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ

 బీఆర్‌‌ఎస్‌ రజతోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ

మహబూబాబాద్, వెలుగు: 27న ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించే  బీఆర్‌‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ మంత్రి సత్యవతి రాథోడ్​ కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌‌ఎస్‌ ఆఫీసులో రజతోత్సవ సభ వాల్​పోస్టర్‌‌ను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.