కామారెడ్డి పోటీపై కేసీఆర్ ​సందిగ్ధంలో పడ్డారు : మాజీ మంత్రి షబ్బీర్​ అలీ

కామారెడ్డి, వెలుగు: ఇటీవల సర్వేలు చేయించుకున్న కేసీఆర్​ కామారెడ్డిలో పోటీపై సందిగ్ధంలో పడ్డారని మాజీ మంత్రి షబ్బీర్​అలీ పేర్కొన్నారు. ఆదివారం పాల్వంచ మండలం ఇసాయిపేటలో గడపగడపకు కాంగ్రెస్​ కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్​లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్​ హైదరాబాద్ ​చుట్టుపక్కల భూములు దోచేకొని అమ్మేశారని, గజ్వేల్​లోనూ దోపడి భూ దోపిడి చేశారన్నారు. అక్కడ ప్రభుత్వ భూములు లేక కామారెడ్డికి వస్తున్నారన్నారు. రైతుల బతుకులు మారుస్తానని ధరణి పోర్టల్ ​తీసుకొచ్చి, భూమి హక్కుదారు పేర్లు మార్చారన్నారు. ప్రభుత్వం ప్రజల నుంచి అసైన్డ్​ భూములు లాక్కొని అమ్మేస్తోందన్నారు.

మరో మూడు నెలల్లో కాంగ్రెస్​పార్టీ అధికారంలోకి వస్తుందని, గ్యారెంటీ పథకాలను అమలు చేస్తోందన్నారు. డీసీసీ ప్రెసిడెంట్​ కైలాస్ ​శ్రీనివాస్​రావు, పార్టీ మండలాధ్యక్షుడు గణేశ్​నాయక్, లీడర్లు మద్ది చంద్రకాంత్​రెడ్డి, ఇంద్రాకరణ్​రెడ్డి, విష్ణువర్ధన్​రెడ్డి, నౌషిలాల్, సుధాకర్​ పాల్గొన్నారు.  

తెలంగాణలో గంగాజమున తహజీబ్​

తెలంగాణలో మొదటి నుంచి గంగాజమున తహజీబ్​కొనసాగుతోందని, కులమతాలకు అతీతంగా ప్రతీఒక్కరు కలిసిమెలిసి జీవిస్తారని మాజీ మంత్రి షబ్బీర్​అలీ పేర్కొన్నారు. ఆదివారం కామారెడ్డిలోని మదీనా మజీద్​లో మర్క జే మిలాద్​ కమిటీ ఆధ్వర్యంలో   రక్తదాన శిబిరం నిర్వహించారు.

షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. ఈసారి వినాయక నిమజ్జనం రోజునే  మిలాద్​ఉన్​నబీ రావడంతో టౌన్​లో ర్యాలీ రద్దు చేసి, రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.